భార‌త జ‌ట్టులోకి మ‌రో బుమ్రా..ఇక ఆపడం ఎవరి తరం కాదు !

by velandi.Saikiran |

ఆఫ్ఘానిస్తాన్ తో జ‌రిగే వ‌న్డేల కోసం ప్రిన్స్ యాద‌వ్ ను సెల‌క్ట్ చేసింది బీసీసీఐ.

భార‌త జ‌ట్టులోకి మ‌రో బుమ్రా..ఇక ఆపడం ఎవరి తరం కాదు !
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జూన్ 14వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో అనూహ్యంగా లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలతో ఆడి, టైటిల్ గెలవడం తన కోరిక అంటూ ప్రిన్స్ యాదవ్ ఇటీవ‌లే పేర్కొన్నారు.

ఇంతలోనే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో ప్రిన్స్ యాదవ్ కు చోటు దక్కింది. లక్నో జట్టులో కీలక బౌలర్ గా మారిన ప్రిన్స్ యాదవ్... డెత్ ఓవర్స్ లో యార్కర్లతో బ్యాటర్లను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అచ్చం బుమ్రా లాగానే బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అందుకే అతన్ని జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలో ప్రిన్స్ యాదవ్ ఇలాగే దూసుకు వెళ్లాలని క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. భారత జట్టులో రాణిస్తూ, వన్డే వరల్డ్ కప్ లో స్థానం దక్కించుకోవాలని పేర్కొంటున్నారు.

ఇంత‌కు ఎవ‌రీ ప్రిన్స్ యాదవ్ ?

ప్రిన్స్‌ యాదవ్ ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఆడుతున్నాడు. ఇతన్ని కేవలం రూ.30 లక్షలకు మాత్రమే లక్నో కొనుగోలు చేసింది. ఢిల్లీ సమీపంలోని నజాఫ్ గఢ్ గ్రామానికి చెందిన ప్రిన్స్ యాదవ్... చిన్నతనంలోనే టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడి పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సీనియర్ క్రికెటర్ లలిత్ యాదవ్... ఇతని ప్రతిభను గుర్తించి క్రికెట్ అకాడమీలోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ దేశవాళి క్రికెట్ జట్టులో ఆడడమే కాకుండా ఇప్పుడు ఐపీఎల్ లో రాణిస్తున్నాడు.

Next Story