నేడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. భారత్ తుది జట్టు నుంచి వారిద్దరూ ఔట్?

by Harish |

నేడు నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. భారత్ తుది జట్టు నుంచి వారిద్దరూ ఔట్?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. గ్రూపు దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. యూఎస్‌ఏ, నమీబియా, పాకిస్తాన్‌లను చిత్తు చేసి జోరు మీద ఉంది. నేడు తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. బలమైన సూర్య సేన.. డచ్ జట్టుపై గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే, సూపర్-8‌కు ముందు ఈ మ్యాచ్‌ను సన్నాహకంగా ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. సూపర్-8 రౌండ్‌లో సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌ జట్లను ఎదుర్కోనుంది. ఈ రౌండ్‌కు ముందు జట్టులో ఉండే చిన్ని చిన్న లోపాలను కూడా సరిదిద్దుకోవడానికి సూర్య సేనకు ఈ మ్యాచ్ చక్కటి అవకాశం.

బుమ్రాకు రెస్ట్.. సుందర్‌కు చాన్స్?

ఈ మ్యాచ్‌ కోసం భారత్ తుది జట్టులో కొన్ని మార్పులు చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే సూపర్-8 బెర్త్ దక్కడంతో స్టార్ బౌలర్ బుమ్రాకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌లలో ఒక్కరికి చోటు దక్కుతుంది. వీరిద్దరూ పాక్‌తో మ్యాచ్ ఆడలేదు. అలాగే, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌‌‌ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గాయం నుంచి కోలుకున్న అతను పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడు. కాబట్టి, అతనికి ఓ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావించొచ్చు. అలాగే, యూఎస్‌ఏ, పాక్‌తో మ్యాచ్‌లో అభిషేక్ పరుగుల ఖాతా తెరవకముందే అవుటయ్యాడు. అతను ఫామ్ అందుకోవడానికి ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంది.

Next Story