ప్రసిద్ దెబ్బ అదుర్స్..అప్పుడు స్మిత్, ఇప్పుడు బ్రూక్..ఆ ఒక్క పరుగు చేయకుండా!

by velandi.Saikiran |   (  Updated:2025-06-22 16:58:54  IST  )

టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య మొదటి టెస్ట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ప్రసిద్ దెబ్బ అదుర్స్..అప్పుడు స్మిత్, ఇప్పుడు బ్రూక్..ఆ ఒక్క పరుగు చేయకుండా!
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ (England) మధ్య మొదటి టెస్ట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రెండు జట్లు కూడా పోటా పోటీగా ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 113 ఓవర్లు ఆడి 471 పరుగులకు అలౌట్ అయింది. అటు ఇంగ్లాండ్ కూడా దాటిగా ఆడి 465 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణ ( Prasidh Krishna) ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు.

రెండో రోజు పెద్దగా రాణించని ప్రసిద్ కృష్ణ... ఇవాళ మాత్రం మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ నడ్డి విరిచాడు. ముఖ్యంగా... భయంకరంగా మారుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు గ్రూప్ వికెట్ తీశాడు ప్రసిద్ కృష్ణ. అది కూడా 99 పరుగులు చేసిన హరీ బ్రూక్ (Harry Brook )... వికెట్ తీసి చరిత్ర సృష్టించాడు. 112 బంతులు వాడిన హరీ బ్రూక్... 99 పరుగుల వద్ద ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు.

అయితే... గత సంవత్సరం చివరలో బోర్డర్ గవాస్కర్ 2025 టోర్నమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ ను ( Steven Smith) కూడా 9999 పరుగుల వద్ద అవుట్ చేశాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఐదవ టెస్టులో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ సెంచరీ కాకుండా హరీ బ్రూక్ వికెట్, అటు పది వేల పరుగులు చేయకుండా స్టీవెన్ స్మిత్ ను ప్రసిద్ కృష్ణ అవుట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు.

Instagramme link

Next Story