ఒకే ఓవర్‌లో 23 రన్స్.. చెత్త రికార్డు మూటగట్టుకున్న ప్రసిద్ధ్ కృష్ణ

by Harish |

ఒకే ఓవర్‌లో 23 రన్స్.. చెత్త రికార్డు మూటగట్టుకున్న ప్రసిద్ధ్ కృష్ణ
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా యువ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఇంగ్లాండ్ టూరులో దారుణంగా విఫలమవుతున్నాడు. రెండో టెస్టులోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతను ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. టెస్టు చరిత్రలోనే వరస్ట్ ఎకానమీ బౌలర్‌గా నిలిచాడు. 500 లేదా అంతకంటే ఎక్కువ బంతులు వేసిన తర్వాత అతను ఎకానమీ 5.28. 588 బంతుల్లో 518 రన్స్ ఇచ్చాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది వరల్డ్ ఎకానమీ. రెండో టెస్టులో అతను వేసిన 32వ ఓవర్‌లో 23 రన్స్ ఇవ్వడంతో ఈ చెత్త రికార్డును నమోదు చేశాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో వరస్ట్ బౌలింగ్ ఎకానమీ కలిగిన బౌలర్లలో ప్రసిద్ధే టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత భారత స్పిన్నర్ వరుణ్ ఆరోన్ 4.77 ఎకానమీతో రెండో స్థానంలో ఉండగా.. జహీర్ ఖాన్(4.66, అఫ్గనిస్తాన్), అమీర్ జమాల్(4.63 పాకిస్తాన్), నహీద్ రాణా(4.59, బంగ్లాదేశ్) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


Next Story