- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూపర్ బెట్ చెస్ ఛాంపియన్ గా ప్రజ్ఞానంద...ప్రైజ్ మనీ ఎంతంటే?
సూపర్ బెట్ చెస్ 2025 ఛాంపియన్‌గా ప్రముఖ చెస్ ఆటగాడు ప్రజ్ఞానంద నిలిచారు. రొమేనియా దేశ రాజధాని బుకారెస్ట్ లో శుక్రవారం సూపర్ బెట్ చెస్ క్లాసిక్ 2025 పోటీలు జరిగాయి.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ బెట్ చెస్ 2025 ఛాంపియన్‌గా ప్రముఖ చెస్ ఆటగాడు ప్రజ్ఞానంద నిలిచారు. రొమేనియా దేశ రాజధాని బుకారెస్ట్ లో శుక్రవారం సూపర్ బెట్ చెస్ క్లాసిక్ 2025 పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రజ్ఞానంద టైబ్రేకర్లలో 1.5 పాయింట్లు సాధించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ట్రోఫీతో పాటూ రూ.66.48 లక్షల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. బ్లిట్జ్ టై బ్రేకర్లలో మాక్సిమ్ వాచియర్ లాగ్రేవ్, అలిరెజా ఫిరౌజాను ప్రజ్ఞానంద ఓడించారు. మొదట ఫిరౌజాతో డ్రా చేసుకోగా రెండో టై బ్రేకర్‌లో లగ్రావ్‌పై విజయం సాధించాడు. ఇదిలా ఉంటే ప్రజ్ఞానంద చిన్నయవసులోనే చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగాడు. 2025లో టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంటులో గెలిచిన తరవాత ప్రజ్ఞానంద ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. అంతకుముందే 2023లోనూ ప్రపంచ చెస్ ప్రపంచ కప్‌లో రెండవ స్థానంలో నిలిచాడు.






