- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిస్టరీ క్రియేట్ చేసిన ప్రజ్ఞానంద.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి
by Phanindra |
ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద హిస్టరీ క్రియేట్ చేశాడు. ఉజ్‌చెస్ చాంపియన్‌షిప్ నెగ్గి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకాడు.

X
దిశ, స్పోర్ట్స్: చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. లైవ్ ర్యాంకింగ్స్‌లో భారత టాప్ ర్యాంకింగ్ ప్లేయర్‌గా నిలిచాడీ 19 ఏళ్ల చెస్ ఛాంపియన్. తాజాగా ఉజ్‌చెస్ కప్ మాస్టర్స్ ఫైనల్ రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నోడిర్బెక్ అబ్దుసొట్టొరావ్‌ను బ్లాక్ పీసెస్‌తో ప్రజ్ఞానంద ఓడించాడు.
దీంతో అతని లైవ్ రేటింగ్స్ 2778.3 పాయింట్లకు చేరాయి. అలాగే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్ బెస్ట్ నాలుగో స్థానానికి చేరాడు ప్రజ్ఞానంద. ఈ క్రమంలో వరల్డ్ ఛాంపియన్ గూకేష్ (2776.6 రేటింగ్ పాయింట్ల)ను కూడా దాటేశాడు. ఈ జాబితాలో మాగ్నస్ కార్లసన్ 2839.2 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Next Story






