Praggnanandhaa : భారత నం.1 చెస్ ర్యాంకర్ గా ప్రజ్ఞానంద

by Muthe.Rajitha |

భారత స్టార్ చెస్ ప్లేయర్(Chess Player) ప్రజ్ఞానంద మరో ఘనత సాధించారు.

Praggnanandhaa : భారత నం.1 చెస్ ర్యాంకర్ గా ప్రజ్ఞానంద
X

దిశ, వెబ్ డెస్క్ : భారత స్టార్ చెస్ ప్లేయర్(Chess Player) ప్రజ్ఞానంద మరో ఘనత సాధించారు. రమేష్‌ బాబు ప్రజ్ఞానంద (Rameshbabu Praggnanandhaa) భారత నంబర్ 1 గా నిలిచాడు ఈ యువ చెస్ గ్రాండ్‌మాస్టర్(Grand Master). ప్రజ్ఞానంద 2024 జనవరిలో టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించాడు. దీంతో ఇదివరకు విశ్వనాథన్ ఆనంద్‌ పేరిట ఉన్న రికార్డును అధిగమించి నం.1 స్థానంలో నిలిచాడు. మరోవైపు 2025 జూన్‌లో ఉజ్‌చెస్ కప్ మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకుని, తన లైవ్ రేటింగ్‌ను 2778.3కి పెంచుకుని ప్రపంచంలో 4వ ర్యాంక్ సాధించాడు. కాగా 12 ఏళ్ల వయస్సులోనే గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించి,అప్పట్లో ప్రపంచంలో రెండవ అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు ఈ స్టార్ ప్లేయర్.

Next Story