- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
PRABHAS:కొత్త లుక్ లో ప్రభాస్... ఇక మాస్ జాతర షురూ !
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణం రాజు ( Krishnam Raju) వారసత్వాన

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కృష్ణం రాజు ( Krishnam Raju) వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీని దున్నేస్తున్న ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు. ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా కావడం విశేషం. బాహుబలి లాంటి బడా సినిమా చేసిన తర్వాత ప్రభాస్ క్రేజీ ప్రపంచ స్థాయికి చేరింది.
ఆ సినిమా తర్వాత అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తాజాగా ప్రభాస్ కొత్త లుక్ లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజా సాబ్ ( TheRajaSaab ) సెట్స్ లో నిర్మాత ఎస్ కే ఎన్ కు (SKN) ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ అలాగే నిర్మాత ఇద్దరు కలిసి దిగిన ఫోటోను రాజా సాబ్ చిత్ర బృందం షేర్ చేసింది.
ఈ పోస్టులో.. ప్రభాస్ చాలా గ్లామర్ గా కనిపించారు. స్పెట్స్ పెట్టుకుని... బ్రౌన్ కలర్ షర్ట్ ధరించి మెరిచారు ప్రభాస్. ఇక ఈ ఫోటోను చూసిన ప్రభాస్ ఫ్యాన్స్... తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ లుక్ అదిరిపోయిందని.. రాజా సాబ్ సినిమా కూడా దుమ్ము లేపుతుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభాస్ అలాగే మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ సినిమా డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.






