- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RCB కోసం పెళ్లి కూడా రద్దు చేసుకున్న డేంజర్ ప్లేయర్.. కానీ చివరికి!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) గెలిచిన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) గెలిచిన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనలో 11 మంది మృతి చెందగా.. మరో 30 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఈ సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) చేసిన త్యాగం గురించి ఇప్పుడు బయటపడింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్ తీసుకువచ్చేందుకు తన పెళ్లిని (Rajat Patidar Marriage) కూడా వాయిదా వేసుకున్నాడు కెప్టెన్ రజత్ పాటిదార్. 2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సమయంలో సరిగా ఆడలేదని.. రజత్ పాటిదార్ పై వేటు పడింది. ఈ నేపథ్యంలోనే 2022 ఐపిఎల్ టోర్నమెంట్ సమయంలో అతన్ని పక్కకు పెట్టింది బెంగళూరు యాజమాన్యం. వేరే ఆటగాడు గాయపడడంతో సీజన్ మధ్యలో రీప్లేస్మెంట్ గా రజత్ పాటిదార్ ను తీసుకుంది.
ఇక అదే సమయంలో... రజత్ పాటిదార్ పెళ్లి కూడా ఫిక్స్ అయింది. కానీ పెళ్లిని వాయిదా వేసుకుని మరి... ఐపీఎల్ ఆడేందుకు వచ్చాడు. అదే సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ప్లేయర్ గా మారిపోయాడు. అటు దేశవాలి క్రికెట్ లో కూడా మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్ గా రాణించిన నేపథ్యంలో రజత్ పాటిదార్ కు మొన్న కెప్టెన్సీ కూడా ఇచ్చింది బెంగళూరు యాజమాన్యం. కెప్టెన్సీ రావడంతో.. దాన్ని సరిగ్గా వినియోగించుకున్నాడు రజత్ పాటిదార్. ఫలితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలుచుకుంది.






