IPL 2025 Final: రెస్టారెంట్‌లో కోహ్లీ రహస్య పూజలు !

by velandi.Saikiran |   (  Updated:2025-08-15 11:52:19  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన రెస్టారెంట్ లో ప్రత్యేక పూ

IPL 2025 Final: రెస్టారెంట్‌లో కోహ్లీ రహస్య పూజలు !
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన రెస్టారెంట్ లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. తనకు కలిసి వచ్చిన బెంగళూరులోని... రెస్టారెంట్ లో ( Virat Kohli's restaurant) దాదాపు నలుగురు పురోహితులతో.. పూజలు చేయిస్తున్నాడని ఓ వీడియో బయటకు వచ్చింది. ఇవాళ ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో... ఎలాగైనా టైటిల్ గెలవాలని.. విరాట్ కోహ్లీ ( Virat Kohli ) పూజలు చేయిస్తున్నట్లు చెబుతున్నారు.

అలాగే ఇటీవల తన రెస్టారెంట్ పై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అలాంటి కేసులు, ఇతర వివాదాలు కూడా మళ్లీ తెరపైకి రాకుండా శాంతి పూజలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక వీడియో మాత్రం బయటకు వచ్చింది. ఇది ఇలా ఉండగా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

ఈ బిగ్ ఫైట్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ టీమ్స్ మధ్య జరగనుంది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే మ్యాచ్ ప్రారంభం కంటే ముందు.. మోడీ స్టేడియం సమీపంలో వర్షం పడుతోంది. దీంతో గ్రౌండ్ మొత్తం కవర్స్ తో కప్పి ఉంచారు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం ఉండబోదని తెలుస్తోంది.

Next Story