- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్‌లో చేసినట్టు టెస్టుల్లో చేస్తానంటే కుదరదు.. రిషబ్‌కు అశ్విన్ రిక్వెస్ట్
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండు శతకాలతో సత్తాచాటిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెండు శతకాలతో సత్తాచాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్‌పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన అరుదైన ఆటగాళ్లలో పంత్ ఒక్కడని ప్రశంసించాడు. తాజాగా తన యూట్యూబ్ చానెల్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. పంత్‌ను ధోనీతో పోల్చడం సరైంది కాదన్నాడు. పంత్ మెయిన్‌స్ట్రీమ్ బ్యాటర్ కాబట్టి విరాట్ కోహ్లీ లాంటి వాళ్లతో పోల్చాలని చెప్పాడు. ‘పంత్‌కు చాలా కెరీర్ ఉంది. బంతి లైన్, లెంగ్త్‌ని ముందుగానే అంచనా వేసి షాట్లు ఆడే నైపుణ్యం కొందరి స్పెషల్ ప్లేయర్లకు ఉంటుంది. అలాంటి స్పెషల్ స్కిల్స్ ఉన్న అరుదైన ఆటగాళ్లలో పంత్ ఒకడు.’అని అశ్విన్ ప్రశంసించాడు.
ఐపీఎల్‌లో ఆర్సీబీతో చివరి గ్రూపు మ్యాచ్‌లో పంత్ సెంచరీ చేసిన తర్వాత పల్టీ కొట్టి సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్టులోనూ మొదటి ఇన్నింగ్స్ తర్వాత పంత్ అలాగే సంబరాలు చేసుకున్నాడు. దీనిపై అశ్విన్ స్పందిస్తూ.. పంత్‌కు ఓ సూచన చేశాడు. అలాంటి విన్యాసాలు చేయొద్దని చెప్పాడు. ‘పంత్‌కు నాదో రిక్వెస్ట్. దయచేసి ఆ ఫ్రంట్ ఫ్లిప్ చేయొద్దు. టెస్టుల్లో శరీరం త్వరగా అలిసిపోతుంది. ఐపీఎల్‌లో 50-60 బంతుల కంటే ఎక్కువ ఆడరు. భారత లైనప్‌లో పంత్ నమ్మకైనమ టాప్ ఆర్డర్. అతను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.






