83 మంది ప్లేయర్లు రిటైన్.. పీకేఎల్ వేలంలో 500 మందికిపైగా ప్లేయర్లు

by Phanindra |

ప్రొ కబడ్డీ లీగ్ ఫ్రాంచైజీలు 83 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. వేలంలో 500 మందికిపైగా ప్లేయర్లున్నారు.

83 మంది ప్లేయర్లు రిటైన్.. పీకేఎల్ వేలంలో 500 మందికిపైగా ప్లేయర్లు
X

దిశ, స్పోర్ట్స్: ప్రొ కబడ్డి లీగ్ 12వ సీజన్ వేలానికి ముందు కీలక ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. మొత్తం 83 మంది ప్లేయర్లు రిటైన్ అయినట్లు పీకేఎల్ నిర్వాహకులు తెలిపారు. 25 మంది ఎలైట్ ప్లేయర్స్‌, 23 మంది యంగ్ ప్లేయర్స్‌, 35 మంది న్యూ యంగ్ ప్లేయర్స్‌ను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నట్లు పీకేఎల్ ప్రకటించింది. 11వ సీజన్ టాప్ రైడర్ దేవాంక్ దలాల్ సహా పవన్ సెహ్రావత్, అర్జున్ దేశ్వాల్, అషు మాలిక్ వంటి స్టార్లు కూడా వేలంలో ఉన్నారు. దబాంగ్ ఢిల్లీ తరఫున 1102 రెయిడ్ పాయింట్లు స్కోర్ చేసిన వెటరన్ నవీన్ కుమార్ తొలిసారి వేలంలో పాల్గొనబోతున్నాడు. మే 30, జూన్ 1వ తేదీల్లో జరిగే వేలంలో 500 మందికిపైగా ప్లేయర్లు ఆక్షన్‌లో ఉండటం గమనార్హం.

Next Story