- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముదిరిన ‘నో షేక్ హ్యాండ్’ వివాదం.. PCB సంచలన నిర్ణయం
ఆసియా కప్-2025 (Asia Cup-2025) సంచలనాలకు వేదిక అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్-2025 (Asia Cup-2025) సంచలనాలకు వేదిక అవుతోంది. ఆదివారం భారత్ (India)-పాకిస్తాన్ (Pakistan) మ్యాచ్ అనంతరం చోటుచేసుకున్న ‘నో షేక్ హ్యాండ్’ వివాదం మరింత ముదురుతోంది. మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాప్ట్‌ని వెంటనే తొలగించాలని పీసీబీ డిమాండ్ చేయగా అందుకు ఐసీసీ రెండో సారి కూడా నో చెప్పింది. ఈ పరిణామంతో ఆసియా కప్‌ను బహిష్కరించాలని పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇవాళ యూఏఈతో మ్యాచ్‌ను ఆ జట్టు బైకాట్ చేసింది. దీంతో హోటల్ నుంచి పాక్ ఆటగాళ్లు ఎవరూ బయటకు రాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, పాకిస్తాన్ జట్టు సభ్యులతో కరచాలనం చేయకూడదనే తమ నిర్ణయానికి భారత్ టాస్ నుంచి ఆట ముగిసే వరకు కట్టుబడి ఉంది. టాస్ సందర్భంగా ఆండీ పైక్రాప్ట్.. భారత కెప్టెన్ సూర్యకుమార్ దగ్గరికి షేక్ హ్యాండ్ కోసం వెళ్లవద్దని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో చెప్పాడంటూ వచ్చిన వార్తలు హీటును పుట్టిస్తున్నాయి. దీంతో మ్యాచ్ రిఫరీ క్రీడా స్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడని వెంటనే అతడిని ఆసియా కప్ నుంచి తప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. కానీ, ఇక్కడ అసలు ట్వీస్ట్ ఏంటంటే.. పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ హెడ్‌గా ఉన్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ సూచనల మేరకే రిఫరీ ఆండీ పైక్రాప్ట్ ‘నో షేక్ హ్యాండ్’ గురించి పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు తెలియజేశాడని విశ్వసనీయంగా తెలుస్తోంది.






