- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం వల్ల పీసీబీకి భారీ నష్టం.. ఎంత నష్టపోయిందో తెలుసా?

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల సొంతగడ్డపై జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాక్ అవమానకర రీతిలో గ్రూపు దశకే పరిమితమైన విషయం తెలిసిందే. ఆతిథ్య హక్కుల విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి భారీ నష్టం కలిగినట్టు తెలుస్తోంది. చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం వల్ల దాదాపు రూ.739 కోట్లు నష్టపోయినట్టు సమాచారం. ఐసీసీ టోర్నమెంట్ కోసం దాదాపు రూ.869 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాల పునరుద్ధరణ కోసమే పీసీబీ రూ. 560 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆటగాళ్ల భద్రత కారణంగా టీమిండియా పాక్‌కు వెళ్లలేదు. తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. భారత్ మ్యాచ్‌లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందనే విషయం తెలిసిందే. సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లోనే జరిగాయి. మరోవైపు, పాక్ జట్టు గ్రూపు దశలోనే నిష్ర్కమించింది. ఈ ఫలితాలు ఆదాయంపై ప్రభావం చూపాయి. హోస్టింగ్ ఫీజు, టికెట్ల విక్రయం ద్వారా పీసీబీ దాదాపు రూ. 52 కోట్లు పొందింది. ఫలితంగా దాదాపు 739 కోట్లు పీసీబీ నష్టపోయినట్టు తెలుస్తోంది. ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవడానికి పీసీబీ దేశీయ టీ20 ప్లేయర్ల మ్యాచ్ ఫీజులను తగ్గించింది. మ్యాచ్ ఫీజులో దాదాపు 90 శాతం కోతపెట్టింది.