- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ తో మ్యాచ్..పాకిస్తాన్ కొత్త డ్రామా షురూ..ఊసరవెల్లి కంటే దారుణం !
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మెత్తబడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోందట.

దిశ, వెబ్ డెస్: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 world cup 2026) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) రోజుకో డ్రామా ఆడుతోంది. మొదటగా అసలు ఈ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఆడబోమంటూ వింత వాదనను తెరపైకి తీసుకు వచ్చిన పాకిస్తాన్, ఆ తర్వాత కొలంబోకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. అనంతరం టోర్నమెంట్ ఆడతాం కానీ, ఇండియా లాంటి భయంకరమైన జట్టుతో ఆడబోమంటూ బహిష్కరిస్తున్నట్లు ప్రకటన చేసింది. పాకిస్తాన్ బోర్డు తరహాలోనే.. అక్కడి ప్రధాని షరీఫ్ కూడా అధికారిక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ పట్ల ఇండియా దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని.. ఈ నేపథ్యంలోనే భారత జట్టుతో ఆడే మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వీడియో ద్వారా వెల్లడించారు.
యూటర్న్ తీసుకున్న పాకిస్తాన్.. ఇండియాతో మళ్లీ మ్యాచ్
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా మొన్నటి వరకు ఇండియాతో జరిగే లీగ్ స్టేజ్ మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మెత్తబడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు చేస్తోందట. బహిష్కరణ అనే మాటను పక్కకు పెట్టి, మళ్లీ ఐసీసీ దగ్గరకు పాకిస్తాన్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇండియాతో అసలు పెట్టుకోమని, వాళ్లతో సామరస్యంగా మ్యాచ్ ఆడతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చిందట.
భారీ జరిమానాలు, బైలేటరల్ సిరీస్ లపై నిషేధం విధిస్తామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC) వార్నింగ్ ల మీద వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగి వచ్చినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. శ్రీలంక బోర్డు కూడా ఆర్థికంగా నష్టాల బారిన పడే ప్రమాదం ఉంది. ఇండియా తో మ్యాచ్ ఆడాలని పదే పదే పాకిస్తాన్ ను ఒత్తిడి చేసింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలోనే ఆదివారం కొలంబోలో జరగాల్సిన హై- వోల్టేజ్ పోరుకు పాకిస్తాన్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇవాళ సాయంత్రం లేదా రేపు ప్రకటన కూడా రాబోతున్నట్లు చెబుతున్నారు. అటు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కూడా టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇండియాతో మ్యాచ్ ఆడాలని ఆదేశాలు ఇచ్చారట. దీంతో ఐసీసీతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
నెదర్లాండ్ పై తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ లో విజయం సాధించింది. నెదర్లాండ్స్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడిన పాకిస్తాన్, మూడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ 147 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని చేధించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది పాకిస్తాన్. చివరి ఓవర్ వరకు ఆడిన పాకిస్తాన్ ఎట్టకేలకు విక్టరీ కొట్టింది.






