ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా మొహ్సిన్ నఖ్వీ

by Harish |

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ ఏసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) కొత్త చైర్మన్‌గా నియామకం అయ్యాడు.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా మొహ్సిన్ నఖ్వీ
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ మొహ్సిన్ నఖ్వీ ఏసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) కొత్త చైర్మన్‌గా నియామకం అయ్యాడు. గురువారం వర్చువల్‌గా జరిగిన ఏసీసీ వార్షిక సాధారణ సమావేశంలో కొత్త చెర్మన్ నియామకం జరిగింది. గురువారం నుంచే నఖ్వీ బాధ్యతలు చేపడతాడని ఏసీసీ తెలిపింది. శ్రీలంక క్రికెట్ హెడ్ షమ్మీ సిల్వా నుంచి నఖ్వీ పగ్గాలు అందుకున్నాడు. ఏసీసీ చైర్మన్ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతాడు. ‘వరల్డ్ క్రికెట్‌కు ఆసియా హార్ట్ బీట్ లాంటిది. క్రికెట్ అభివృద్ధికి బోర్డు సభ్యులతో కలిసి పని చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. ఆసియా క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాం.’ అని నఖ్వీ తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ నఖ్వీకి అతిపెద్ద సవాల్‌ కానుంది. ఆ టోర్నీకి భారత్ ఆతిథ్యమిస్తుండగా.. పాక్ మ్యాచ్‌లు తటస్థ వేదికపై జరగనున్నాయి. తటస్థ వేదికపై నఖ్వీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


Next Story