టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం.. మిథాలీ, జులన్ గోస్వామి తర్వాత ఆమెనే

by Harish |

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ సారథ్యంలో తొలిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే.

టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అరుదైన గౌరవం.. మిథాలీ, జులన్ గోస్వామి తర్వాత ఆమెనే
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ సారథ్యంలో తొలిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. భారత మహిళల జట్టుకు ప్రపంచకప్ అందించిన తొలి కెప్టెన్‌గా హర్మన్ భారత క్రికెట్‌లో తన పేరు లిఖించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(పీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌లో ఉన్న మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో ఓ స్టాండ్‌కు హర్మన్‌ప్రీత్ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని తాజాగా హర్మన్‌ ఓ జాతీయ మీడియాకు రివీల్ చేసింది. ‘పీసీఏ నుంచి నాకు లెటర్ అందింది. ముల్లాన్‌పూర్‌‌లో త్వరలో నా పేరుతో స్టాండ్ ఆవిష్కరిస్తున్నట్టు చెప్పారు.’అని హర్మన్‌ తెలిపింది. మైదానంలో స్టాండ్‌కు తన పేరు పెట్టడమనేది ఏ క్రికెటర్‌కు అయినా చాలా గొప్ప గౌరవం. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి తర్వాత ఈ గౌరవం పొందిన మూడో భారత క్రికెటర్ హర్మన్.


Next Story