ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ సిరీస్‌కు కొత్త ట్రోఫీ

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పూర్తయింది. ఇక ఇప్పుడు.. టీమిండియా మరో సంబరానికి సిద్ధమైంది. కోహ్లీ అలాగే

ఇంగ్లండ్-ఇండియా టెస్ట్ సిరీస్‌కు కొత్త ట్రోఫీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పూర్తయింది. ఇక ఇప్పుడు.. టీమిండియా మరో సంబరానికి సిద్ధమైంది. కోహ్లీ అలాగే రోహిత్ శర్మ లాంటి కీలక ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఈనెల జూన్ 20వ తేదీ నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతోంది.

అయితే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరుగుతున్న ఈ టెస్ట్ కు కొత్త పేరు ఖరారు చేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. టెండూల్కర్ - అండర్సన్ ట్రోఫీ పేరుతో ఈ సిరీస్ నిర్వహించబోతున్నట్లు తాజాగా ప్రకటన చేసింది. గతంలో ఉన్న పటోడి టోర్నమెంట్ను రద్దు చేస్తూ ఈ కొత్త పేరును పెట్టింది.

కాగా జూన్ 20వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య... ఈ కొత్త సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ట్రోఫీని లాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ అలాగే అండర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇరు దేశాల మధ్య టెస్టిస్ సిరీస్ ను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆంథోని డి మెల్లో పేరుతో నిర్వహిస్తోంది. ఇండియాలో కూడా ఈ మార్పు ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story