అది మా స్టైల్ కాదు.. డ్రగ్స్ విషయంతో రబాడను స్లెడ్జ్ చేయం: కమిన్స్

by Phanindra |

డ్రగ్స్ విషయంతో రబాడను స్లెడ్జ్ చేస్తారా అని ప్రశ్నిస్తే.. అది మా స్టైల్ కాదని, ఆ విషయం ఎవరైనా ప్రస్తావిస్తే ఆశ్చర్యపోతానని కమిన్స్ చెప్పాడు.

అది మా స్టైల్ కాదు.. డ్రగ్స్ విషయంతో రబాడను స్లెడ్జ్ చేయం: కమిన్స్
X

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అంతా రెడీ అయింది. ఫైనలిస్టులు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ కీలక మ్యాచులో ఆసీస్ ప్లేయర్లు కచ్చితంగా తమ స్లెడ్జింగ్ ఎటాక్‌కు కూడా పదును పెడతారని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే సఫారీ స్టార్ పేసర్ కగిసో రబాడను డ్రగ్ బ్యాన్ విషయాన్ని టార్గెట్ చేస్తారా? అని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను ప్రశ్నించారు. ‘అది మా స్టైల్ కాదు. ఆ విషయం కనుక ఎవరైనా ప్రస్తావిస్తే నేనే ఆశ్చర్యపోతా’ అని నవ్వేశాడు. ఇటీవలే డ్రగ్స్ వాడిన కారణంగా ఒక నెల రోజుల పాటు క్రికెట్‌కు రబాడ దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా ప్లేయర్ల స్లెడ్జింగ్ ఎటాక్స్ ఎలా ఉంటాయో టెస్టు క్రికెట్ చూసే వారందరికీ తెలిసిందే.

Next Story