- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : పంత్ ప్లాప్ షో
ప్రస్తుతం దేశం ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ తో ఊగిపోతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం దేశం ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్ తో ఊగిపోతోంది. ప్రతిరోజూ మ్యాచ్ లతో క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఎంతగానో ఆశలు పెట్టుకున్న టాప్ ప్లేయర్స్ మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చుతున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు వేలం పలికిన రిషబ్ పంత్(Rishab Pant) తన పూర్ పెర్ఫార్మెన్స్ తో ఆ జట్టు నిర్వాహకుల ఆశలను దారుణంగా దెబ్బ తీస్తున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్లో రూ.27 కోట్లకు లక్నో టీం రిషబ్ ను దక్కించుకోగా ఇంతవరకు జరిగిన 3 మ్యాచుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో అసలు పరుగులేవీ చేయకుండానే ఔటయ్యాడు.
దీంతో అతడి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ LSG కి కెప్టెన్ గా ఉండటం.. ఇలా పేలవమైన ప్రదర్శన చేయడం పంత్ అభిమానులకు, లక్నో జట్టు అభిమానులకు అస్సలు మింగుడు పడటం లేదు. కెప్టెన్ గాను, కీపర్ గాను పూర్తిగా విఫలం అయ్యడాని నెట్టింట్లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. తరువాతి మ్యాచులలోనైనా పంత్ పరుగుల విజృంభణ చేస్తాడని అందరూ గంపెడు ఆశలు పెట్టుకున్నారు.






