PCB సంచ‌ల‌న నిర్ణ‌యం..కొత్త జెర్సీలో పాకిస్తాన్ టీం

by velandi.Saikiran |   (  Updated:2025-10-27 03:43:51  IST  )

పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా (Pakistan vs South Africa) మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానున్న

PCB సంచ‌ల‌న నిర్ణ‌యం..కొత్త జెర్సీలో పాకిస్తాన్ టీం
X

దిశ‌, వెబ్ డెస్క్‌: పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా (Pakistan vs South Africa) మధ్య రేపటి నుంచి టి20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ పూర్తయింది. ఇందులో చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరీస్ సమం అయింది. అయితే రేపటి నుంచి ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఏకంగా మూడు టీ20లు జరగనున్నాయి.

ఇక రేపు అంటే అక్టోబర్ 28వ తేదీన రావల్పిండి వేదికగా మొదటి టీ20 జరగనుంది. రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ టి20 నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త జెర్సీలో కనిపించనుంది. ఇన్ని రోజులు గ్రీన్ జెర్సీలో కనిపించిన పాకిస్తాన్, రేపు మొదటి టీ20 లో మాత్రం పింక్ జెర్సీలో మెరువనుంది. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన, బాధితులకు సహాయం చేసేందుకుగాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రేపు పింక్ జెర్సీలో పాకిస్తాన్ టీం కనిపించనుంది. ఈ మేరకు ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. క్లిక్

Next Story