టీ20 వరల్డ్ కప్‌లో డ్రగ్స్ వాడిన పాక్ స్టార్ క్రికెటర్.. టెస్టులో బయటపడిన బాగోతం

by Harish |

టీ20 వరల్డ్ కప్‌లో డ్రగ్స్ వాడిన పాక్ స్టార్ క్రికెటర్.. టెస్టులో బయటపడిన బాగోతం
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహమ్మద్ నవాజ్ డోపింగ్‌కు పాల్పడ్డాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అతను డ్రగ్స్ తీసుకున్నట్టు బయటపడింది. పొట్టి వరల్డ్ కప్ సందర్భంగా నిర్వహించిన డ్రగ్స్ టెస్టు‌లో అతను దొరికిపోయాడు. నిషేధిత రీక్రియేషనల్ డగ్ర్స్ అతను ఉపయోగించినట్టు తేలింది. ఐసీసీ ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)‌కు తెలియజేయడంతో ఈ బండారం బయటపడింది. దీనిపై పీసీబీ విచారణ ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘ఐసీసీ ఈ విషయాన్ని పీసీబీకి తెలియజేసింది. పీసీబీ తదుపరి ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రక్రియ ఫలితాలను ఐసీసీకి తెలియజేస్తాం.’అని పీసీబీ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. టీ20 ప్రపంచకప్‌లో పాక్ తరపున నవాజ్ అన్ని మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. 7 వికెట్లు తీశాడు.

రీక్రియేషనల్ డ్రగ్స్ అంటే వినోదం కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇవి ప్రదర్శనను మెరుగుపర్చుకునేందుకు కాకపోయినా వీటిపై ఐసీసీ డోపింగ్ రూల్స్ ప్రకారం నిషేధం ఉంది. నవాజ్ డోపీగా తేలడంతో అతని కెరీర్ ప్రమాదంలో పడింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరిగే టీ20 బ్లాస్టర్ టోర్నీలో సర్నే తరపున ఆడేందుకు అతను ఒప్పందం చేసుకున్నాడు. తాజా పరిణామంతో ఆ డీల్‌ను సర్రే రద్దు చేసుకుంది. ప్రస్తుతం అతను పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ఆడుతున్నాడు. పీసీబీ విచారణలో డోపింగ్ రూల్స్ ఉల్లంఘించినట్టు తేలితే నవాజ్‌పై సస్పెన్షన్ లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.


Next Story