- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్ గెలిచిందంటూ ఆఫ్రిది, అక్తర్ సంబరాలు
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో.. శత్రుదేశం పాకిస్తాన్ రెచ్చిపోతూనే ఉంది. కాల్పుల విరమణ

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో.. శత్రుదేశం పాకిస్తాన్ రెచ్చిపోతూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కూడా.. దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో... ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.
ముఖ్యంగా మన ఇండియన్ ఆర్మీ చేతిలో.. పాకిస్తాన్ దేశం కకావికమైంది. మరో రోజు.. యుద్ధం జరిగితే పాకిస్తాన్ భూస్థాపితం.. అయ్యేది. ఓవరాల్ గా పాకిస్తాన్ దేశానికి పై ఇండియా గెలిచిందని చెప్పవచ్చు. ఓడిపోతామని భయంతో అమెరికా దగ్గరికి వెళ్లి ఒప్పందం చేయించుకుని పాకిస్థాన్. అయితే ఈ విషయాన్ని మర్చిపోయిన పాకిస్తానీయులు రెచ్చిపోతున్నారు. ఇండియా పై తామే గెలిచామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే షోయబ్ అక్తర్, షాహిద్ ఆఫ్రిది ఇద్దరూ కూడా ఇండియా పై గెలిచామని సంబరాల్లో పాల్గొన్నారు.
పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. వీటికి ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు హాజరై.. సంబరాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు ఇప్పటికే గెలిచామని ఆఫ్రిది రోడ్ షో కూడా నిర్వహించాడు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల తీరుపై... ఇండియన్స్ సెటైర్లు పెంచుతున్నారు. ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు.. పాకిస్తానీయులు ఇలా వ్యవహరిస్తున్నారని చురకలు అంటిస్తున్నారు.
🚨BREAKING: Pakistani defeat celebration with SHAMELESS Shahid Afridi & Shoaib Akhtar. pic.twitter.com/ibej1tU720
— Manobala Vijayabalan (@ManobalaV) May 17, 2025






