- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాబర్ అదిరిపోయే క్యాచ్..శ్రీలంకపై పాకిస్తాన్ విజయం
హరీస్ రవూఫ్ బౌలింగ్ లో సదీర సమరవిక్రమ స్లిప్ లో ఇచ్చిన క్యాచ్ ను బాబర్ డైవ్ చేసి మరీ అందుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో భాగంగా తాజాగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్, నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 299 పరుగులు సాధించింది. పాకిస్తాన్ స్టార్ ఆటగాడు సల్మాన్ అఘా అద్భుతమైన సెంచరీతో దుమ్ము లేపాడు.
87 బంతుల్లోనే 105 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు సల్మాన్. ఇక 300 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక తేలిపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన శ్రీలంక 293 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆరు పరుగులు తేడాతో శ్రీలంక పై పాకిస్తాన్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం అందుకున్న క్యాచ్ వైరల్ గా మారింది. హరీస్ రవూఫ్ బౌలింగ్ లో సదీర సమరవిక్రమ స్లిప్ లో ఇచ్చిన క్యాచ్ ను బాబర్ డైవ్ చేసి మరీ అందుకున్నాడు. దీంతో మ్యాచ్ టర్న్ అయింది. చివరికి పాకిస్తాన్ విజయం సాధించింది. ఈ తరుణంలోనే బాబర్ అందుకున్న క్యాచ్ వైరల్ అవుతోంది. క్లిక్






