తొలి టీ20లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన పాక్

by Harish |

తొలి టీ20లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన పాక్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌కు ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌‌ను పాకిస్తాన్ ఘనంగా మొదలుపెట్టింది. గురువారం లాహోర్‌లో జరిగిన తొలి టీ20లో ఆసిస్‌కు షాకిచ్చింది. బౌలర్లు మెరవడంతో పాక్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 168 పరుగుల మోస్తరు స్కోరే చేసింది. స్పిన్నర్ ఆడమ్ నాలుగు వికెట్లు తీసి పాక్‌ను బెంబేలెత్తించాడు. అయితే, సైమ్ అయూబ్(40), కెప్టెన్ సల్మాన్ అఘా(39) చెప్పుకోదగ్గ పరుగులు చేసి పాక్‌కు పోరాడే స్కోరు అందించారు. అయితే, ఆసిస్ మోస్తరు స్కోరును ఛేదించడంలో విఫలమైంది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కంగారుల జట్టు 146/8 స్కోరుకే పరిమితమైంది. ఆ జట్టులో గ్రీన్(36), బార్ట‌లెట్(34 నాటౌట్) మాత్రమే పోరాడగా.. మిగతా వారు నిరాశపర్చడంతో ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్, సైయ్ అయూబ్ చెరో 2 వికెట్లతో రాణించారు.


Next Story