హాకీ ఆసియాకప్‌‌లో నో పాకిస్తాన్‌.. భారత వీసాలు కష్టమే..!

by Phanindra |

హాకీ ఆసియాకప్‌‌లో పాకిస్తాన్‌ ఆడటం కష్టంగా కనిపిస్తోంది. ఆ జట్టు ప్లేయర్లకు భారత వీసాలు దొరకడం కష్టమే!

హాకీ ఆసియాకప్‌‌లో నో పాకిస్తాన్‌.. భారత వీసాలు కష్టమే..!
X

దిశ, స్పోర్ట్స్: ఈ ఏడాది జరిగే హాకీ ఆసియా కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. అయితే పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తానీలకు ఇచ్చిన వీసాలను భారత్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ హాకీ జట్టుకు కూడా వీసాలు లభించే అవకాశం కనిపించడం లేదు. ఈ విషయంలో తాము భారత ప్రభుత్వం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్, ఏసియన్ హాకీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ భోలానాథ్ చెప్పారు.


వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ కోసం ఈ ఆసియా కప్ క్వాలిఫైయింగ్ టోర్నీ. ఈ క్రమంలోనే తమ ప్లేయర్లందరికీ భారత వీసాలు ఇప్పించాలని హాకీ ఇండియాను పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) కోరింది. అయితే తాము ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, ప్రభుత్వం ఆదేశాలు మాత్రమే పాటిస్తామని భోలానాథ్ చెప్పారు.

‘ఈ విషయం గురించి ప్రభుత్వంతో మేం ఇంకా చర్చించలేదు. మాకు దేశం ముఖ్యం. భారత్‌లో ఆసియా కప్ జరగుతోంది కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఫైనల్. నేను ఏసియన్ హాకీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్‌ను, హాకీ ఇండియా సెక్రటరీ జనరల్‌గా ఉన్నాను. ఈ పదవులన్నింటి కన్నా ముందు నేను భారత పౌరుడిని. నాకు దేశం, దేశ గౌరవమే ముఖ్యం’ అని భోలానాథ్ స్పష్టం చేశారు.

Next Story