- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసియా కప్ 2025 నుంచి వైదొలగనున్న పాకిస్థాన్..ఐసీసీ వార్నింగ్?
పాకిస్తాన్ బెదిరింపులను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది ఐసీసీ. షేక్ హ్యాండ్ విషయంలో మ్యాచ్ రిఫరీకి.. ఎలాంటి సంబంధం ఉండదని

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వనందుకు.... పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చాలా గుర్రుగా ఉంది. ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలని తాజాగా ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. టాస్ సమయంలో సూర్య కుమార్ యాదవ్.. షేక్ హ్యాండ్ ఇవ్వనందుకుగాను... పాకిస్తాన్ చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. టాస్ సమయంలో మాచ్ రిఫరీ యాండీ అక్కడే ఉన్నా కూడా షేక్ హ్యాండ్ ఇప్పించలేదని పాకిస్తాన్....ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అందుకే అతన్ని ఆసియా కప్ టోర్నమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్ పెట్టిందట పాకిస్తాన్. అలా అయితేనే యూఏఈ తో తర్వాతి మ్యాచ్ ఆడతామని.... పాకిస్తాన్ మొండి పట్టు పట్టింది. అయితే దీనిపై తాజాగా ఐసీసీ స్పందించిందని సమాచారం. పాకిస్తాన్ బెదిరింపులను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది ఐసీసీ.
షేక్ హ్యాండ్ విషయంలో మ్యాచ్ రిఫరీకి.. ఎలాంటి సంబంధం ఉండదని ఐసీసీ స్పష్టం చేసిందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. షేక్ హ్యాండ్ ఇవ్వాలని MCC మాన్యువల్ లో ఎక్కడా లేదని ఐసీసీ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అయితే మ్యాచ్ రిఫరీ యాండీ పైన ఐసీసీ చర్యలు తీసుకోకపోతే టోర్నమెంట్ మధ్యలో నుంచి తప్పుకోవాలని... కొంతమంది మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు వెల్లడిస్తున్నారట. మరి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.






