- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : భద్రతా కారణాల దృష్ట్యా టీ20 ప్రపంచకప్ కోసం తమ జట్టును భారత్‌కు పంపబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఐసీసీని కోరిన విషయం తెలిసిందే. మరో వేదిక అయిన శ్రీలంకకు తమ మ్యాచ్‌లను తరలించాలని అభ్యర్థించింది. అయితే, దీనిపై ఐసీసీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ టోర్నీ ఆతిథ్య విషయంలో సంబంధం లేని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మధ్యలోకి దూరింది. బంగ్లా మ్యాచ్‌లను తాము నిర్వహిస్తామంటూ ఆసక్తిని వ్యక్తం చేసింది. శ్రీలంక మైదానాలు అందుబాటులో లేకపోతే బంగ్లా మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తాని పీసీబీ వర్గాలు తెలిపినట్టు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
‘ఐసీసీ ఈవెంట్లను ఇంతకుముందు పాకిస్తాన్ విజయవంతంగా నిర్వహించింది. చాంపియన్ష్ ట్రోఫీ, ఐసీసీ ఉమెన్స్ క్వాలిఫయర్ జరిగాయి. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను నిర్వహించే సామర్థ్యం కూడా ఉంది.’అని సదరు వర్గాలు తెలిపాయి. ఐసీసీ రిప్లై కోసం బీసీబీ ఎదురుచూస్తోంది. ఐసీసీ నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదని బీసీబీ ప్రెసిడెంట్ అమినుల్ ఇస్లాం బుల్‌బుల్ తెలిపారు. బంగ్లా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించిందని, అంతేకాకుండా భారత్‌కు వెళ్లకపోతే పాయింట్స్ కోల్పోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్టు తెలుస్తోంది. మరోవైపు, ఈ టీ20 ప్రపంచకప్‌లో పాక్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడుతున్న విషయం తెలిసిందే.






