- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫేక్ చెక్కులు ఇచ్చి మోసం చేశారు.. పాకిస్తాన్ క్రికెటర్ ఆరోపణలు
పాకిస్తాన్ ప్రధాని ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినట్లు బాంబు పేల్చారు మాజీ స్పిన్నర్ అజ్మల్.

దిశ, వెబ్ డెస్క్: సొంత దేశ ప్రభుత్వం పైన.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అజ్మల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో పాకిస్తాన్ ప్రధాని ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినట్లు బాంబు పేల్చారు మాజీ స్పిన్నర్ అజ్మల్. ఆసియా కప్ ఫైనల్ 2025 మ్యాచ్ లో పాకిస్తాన్ ను టీమిండియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియాకు దాదాపు రూ. 21 కోట్ల రివార్డు ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
అయితే ఈ నేపథ్యంలో తమ పాకిస్తాన్ లో ఆటగాళ్ల పరిస్థితులపై ఆ జట్టుకు సంబంధించిన మాజీ స్పిన్నర్ అజ్మల్... గతంలో మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 2009 సంవత్సరంలో టీ20 వరల్డ్ కప్ తాము గెలిచినట్లు ఆయన ఈ వీడియోలో వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని జిలాని ఒక్కో ప్లేయర్ కు రూ. 20 లక్షల చెక్ అందించినట్లు వెల్లడించారు.
దాంతో మేము ఎంతో సంబరంతో ఆ చెక్కులను తీసుకున్నామని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే చెక్కులను విడిపించుకుందామని ఒక రోజు నేను బ్యాంకుకు వెళితే అవి బౌన్స్ అయినట్లు వెల్లడించారు. దీంతో... ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకువెళ్తే ఎవరూ పట్టించుకోలేదని కూడా అజ్మల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమ పరువు పోతుందని ఈ విషయాన్ని అప్పట్లో తెలియజేయలేదని.. క్లారిటీ ఇచ్చారు అజ్మల్. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.






