Trending: టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ సంచలనం.. చరిత్ర పుటల్లోకి ముల్తాన్ టెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-20 04:47:12  IST  )

టెస్టు క్రికెట్ చరిత్రలో దాయాది పాకిస్థాన్ (Pakistan) అత్యంత అరుదైన రికార్డును నమోదు చేసింది.

Trending: టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ సంచలనం.. చరిత్ర పుటల్లోకి ముల్తాన్ టెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్టు క్రికెట్ చరిత్రలో దాయాది పాకిస్థాన్ (Pakistan) అత్యంత అరుదైన రికార్డును నమోదు చేసింది. అత్యంత తక్కువ ఓవర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో పాక్ 127 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ముల్తాన్‌ (Multan) వేదికగా వెస్టిండీస్‌ (West Indies)తో జరిగిన తొలి టెస్టులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ (Pakistan) 68.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన విండీస్ 25.2 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ 46.4 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. 251 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 36.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటై ఓటిమి పాలైంది. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ రెండు ఇన్సింగ్స్‌లలో కలిసి ఏకంగా 9 వికెట్లు పడగొట్టాడు. నుమాన్ అలీ 6, అబ్రార్ అహ్మద్ 5 వికెట్లు తీసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా టెస్టు క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‌లో జరిగిన అత్యంత పొట్టి మ్యాచ్ ఇదేనని క్రీడా పండితులు చెబుతున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి కేవలం 1,064 బంతులు మాత్రమే ఆడాయి. 2024లో రావల్పిండిలో ఇంగ్లండ్ (England)-పాకిస్థాన్ (Pakistan) మధ్య జరిగిన మ్యాచ్ 1,233 బంతుల్లో ముగిసింది. 2001లో ముల్తాన్‌ (Multan)లో బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరిగిన మ్యాచ్‌లో 1,183 బంతులు మాత్రమే నమోదయ్యాయి. లాహోర్‌ (Lahore)లో 1986లో వెస్టిండీస్‌ (West Indies)తో జరిగిన రెండో టెస్టులో 1,136 బంతులు, 1990లో ఫైసలాబాద్‌ (Faisalabad)లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 1,080 బంతులు నమోదు కాగా, అదే జట్టుతో ఇప్పుడు జరిగిన మ్యాచ్‌లో అతి తక్కువగా 1,064 బంతులు మాత్రమే నమోదయ్యాయి. ఫలితంగా పాకిస్థాన్‌ (Pakistan)లో జరిగిన అత్యంత పొట్టి టెస్టు మ్యాచ్‌గా ముల్తాన్ టెస్ట్ రికార్డుల పుటల్లోకి ఎక్కింది.

Next Story