- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌కు హాకీ టీంను పంపకూడదని పాక్ డెసిషన్?.. వేదిక మార్చాలని డిమాండ్!
భారత్‌కు హాకీ టీంను పంపకూడదని పాక్ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో భారత్ నుంచి వేదిక మార్చాలని డిమాండ్ చేయనుందట.

దిశ, స్పోర్ట్స్: భారత్‌లో జరిగే ఆసియా కప్, జూనియర్ వరల్డ్ కప్‌లకు తమ హాకీ టీమ్స్‌ను పంపేందుకు పాక్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 7 వరకు హాకీ ఆసియా కప్ జరగనుంది. ఆ తర్వాత నవంబరు, డిసెంబరు నెలల్లో చెన్నయ్ వేదికగా ఎఫ్ఐహెచ్ జూనియర్ వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ రెండు ఈవెంట్లలో పాక్ టీం పాల్గొనేందుకు భారత ప్రభుత్వం అంగీకరించినట్లు భారత హాకీ ఫెడరేషన్ తెలిపింది.
ఈ క్రమంలో పాక్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) తమ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ కోరింది. సెక్యూరిటీ క్లియరెన్స్ వస్తే పర్మిషన్ లభిస్తుందని పీహెచ్ఎఫ్ భావించింది. అయితే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ అనుమతి ఇచ్చే పరిస్థితిలో లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పహెల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పాక్ జట్టును భారత్‌లోకి అనుమతించడంపై కేంద్ర ప్రభుత్వంపై కూడా విమర్శలొచ్చాయి.
ఈ నేపథ్యంలోనే తమ జట్టును భారత్‌కు పంపేందుకు పాక్ సిద్ధంగా లేనట్లు సమాచారం. పాక్ సర్కారు నుంచి ‘నో’ అని సమాధానం రాగానే.. ఈ రెండు హాకీ ఈవెంట్లను భారత్ నుంచి మార్చి ఒమన్ లేదా మలేసియా వంటి తటస్థ వేదికల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తామని పీహెచ్ఎఫ్ చెప్పింది. కానీ ఆ దేశాల వద్ద అంత బడ్జెట్ లేకపోవడం వల్ల ఇది జరగకపోవచ్చని కూడా పేర్కొంది.






