- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > స్పోర్ట్స్ > పాపం పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాజయం.. టీ20 సిరీస్ కైవసం చేసుకున్న ఆఫ్ఘాన్
పాపం పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఘోర పరాజయం.. టీ20 సిరీస్ కైవసం చేసుకున్న ఆఫ్ఘాన్

X
దిశ, వెబ్‌డెస్క్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే పాకిస్థాన్ జట్టును చిత్తు చేసి ఆఫ్ఘాన్ జట్టు పాకిస్తాన్ జట్టుపై మొట్టమొదటి 20 సిరీస్ ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టుకు ఆప్ఘనిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపించారు.
దీంతో అతికష్టం మీద పాకి 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. అనంతరం 131 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘాన్ జట్టు 19.5 ఓవర్లకు కేవలం 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా.. సీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-6లో ఉన్న జట్టుపై ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ గెలుచుకుంది.
Next Story






