భారత్‌కు పాక్ జట్టు.. ఆసియా కప్, జూనియర్ వరల్డ్ కప్ కోసం తప్పదు!

by Phanindra |

ఆసియా కప్, జూనియర్ వరల్డ్ కప్ కోసం భారత్‌కు పాక్ జట్టు రాక తప్పదు. దీనికి కేంద్రం కూడా అంగీకారం తెలపనుందని క్రీడాశాఖ చెప్తోంది.

భారత్‌కు పాక్ జట్టు.. ఆసియా కప్, జూనియర్ వరల్డ్ కప్ కోసం తప్పదు!
X

దిశ, స్పోర్ట్స్: భారత్‌లో జరిగే హాకీ ఆసియా కప్, జూనివయర్ వరల్డ్ కప్‌లలో పాల్గొనేందుకు పాక్ జట్టు కూడా ఇండియాకు రానుంది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు వెల్లడించాయి. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా దెబ్బతినడంతో ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి క్రీడాపోటీలు జరగడం లేదనే సంగతి తెలిసిందే. అయితే భారత్‌లో జరిగే మల్టీనేషనల్ ఈవెంట్స్‌లో పాకిస్తాన్ పాల్గొనడాన్ని అడ్డుకోబోమని కేంద్రం తెలిపింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిర్ వేదికగా హాకీ ఆసియా కప్ జరగనుంది.

అలాగే చెన్నై, మదురై వేదికలుగా నవంబరు 28 నుంచి డిసెంబరు 10 వరకు జూనియర్ వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాక్ పాల్గొనకుండా అడ్డుకుంటే ఒలింపిక్ చార్టర్‌ను ధిక్కరించినట్లు అవుతుందని, కావున భారత్‌కు పాక్ జట్టు వచ్చేందుకు క్రీడాశాఖ అంగీకరించనుందని సమాచారం. అయితే క్రికెట్ ఆసియా కప్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంలో బీసీసీఐ ఇంకా తమను సంప్రదించలేదని క్రీడాశాఖ వర్గాలు తెలిపాయి.

Next Story