టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్ ఎలిమినేట్ ? పాకిస్తాన్ లో సంబ‌రాలు

by velandi.Saikiran |

ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) పట్ల పాకిస్తాన్ ( Pakistan ) అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న నేపథ్యంలో రషీద్ ఖాన్ ( Rashid Khan ) రియాక్ట్ అయ్యాడు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఆఫ్ఘ‌నిస్తాన్ ఎలిమినేట్ ? పాకిస్తాన్ లో సంబ‌రాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ కథ దాదాపు ముగిసినట్లేనని తెలుస్తోంది. ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎలిమినేట్ అయినట్లేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్ లు ఆడితే, రెండింటిలో కూడా ఓడిపోయింది. దీంతో ఒక్క పాయింట్ కూడా సాధించని ఆఫ్ఘనిస్తాన్, మైనస్ రన్ రేట్ తో డీలా పడిపోయింది. అయితే టీ20 వరల్డ్ కప్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎలిమినేట్ అయిందన్న వార్తలు బయటకు రావడంతో పాకిస్తాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారట. అటు లాహోర్ వీధుల్లో టపాకాయలు పేల్చి మరి ఎగిరి గంతేస్తున్నారట పాక్ ఫ్యాన్స్.

పాకిస్తాన్ కు రషీద్ ఖాన్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) పట్ల పాకిస్తాన్ ( Pakistan ) అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న నేపథ్యంలో రషీద్ ఖాన్ ( Rashid Khan ) రియాక్ట్ అయ్యాడు. కొంత మంది తమ ఓటమిని చూసి సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు రషీద్ ఖాన్. దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న మ్యాచ్ జరిగిన తర్వాత రషీద్ ఖాన్ ప్రెస్ మీట్ పెట్టారు. దక్షిణాఫ్రికా పైన పోరాడి ఓడినట్లు గుర్తు చేశారు రషీద్ ఖాన్. కాస్త కష్టపడి ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్ళమని తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్ అభిమానులకు కౌంటర్ ఇచ్చారు. కొంత మంది పాకిస్తాన్ అభిమానులు తమను తక్కువ అంచనా వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.

అలాగే తమ జట్టు ఎలిమినేట్ అయిందన్న వార్తను వైరల్ చేసి, శునకా నందం పొందుతున్నారని నిప్పులు చెరిగారు. నమీబియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి జట్లు ఉన్న గ్రూప్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటే సూపర్ 8కు ( T20 world cup 2026) సులభంగా దూసుకు వెళ్లేదని తెలిపారు. కానీ తమ జట్టు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి బలమైన టీమ్స్ తో పోరాడుతున్నట్లు పాకిస్తాన్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు రషీద్ ఖాన్. పాకిస్తాన్ ప్రస్తుతం ఉన్న గ్రూపులో ఇండియా ఒక్కటే బలమైన జట్టు అంటూ పరోక్షంగా చురకలు అంటించారు. మాలాగా బ‌డా జట్లతో ఆడి గెలిచి చూపించాలని పాకిస్తాక్ కౌంట‌ర్‌ ఇచ్చారు.

రెండు సంవత్సరాల కిందట జరిగిన టీ20 ప్రపంచ కప్ లో ఇండియా లాంటి బలమైన జట్లతో సెమీ ఫైనల్ ఆడేదాకా వెళ్ళామని గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా, గ్రూప్ D లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, తాజాగా దక్షిణాఫ్రికా తో తలపడింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగిన సంగతి తెలిసిందే. రెండు సార్లు సూపర్ ఓవర్లు ఆడాయి ఇరు జట్లు. కానీ చివరికి దక్షిణాఫ్రికా అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 187 పరుగులు చేస్తే... ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే పరుగులు సాధించి సూపర్ ఓవ‌ర్ కు దారితీసింది. సూపర్ ఓవర్ లో దక్షిణాఫ్రికా గెలిచేసింది.

Next Story