ఆ టోర్నీలో ఇక పాల్గొనం.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

by Harish |

భవిష్యత్తులో వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) టోర్నీలో పాల్గొనబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది.

ఆ టోర్నీలో ఇక పాల్గొనం.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : భవిష్యత్తులో వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) టోర్నీలో పాల్గొనబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది. టోర్నీలో తమ ప్లేయర్లు పాల్గొనకుండా నిషేధం విధించింది. ఆదివారం జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మీటింగ్‌లో పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌తో భారత మాజీ క్రికెటర్లు మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించడంతో డబ్ల్యూపీఎల్ చర్చనీయాంశమైంది. డబ్ల్యూపీఎల్ నిర్వాహకులపై పీసీబీ ఆరోపణలు చేసింది. క్రీడా సూత్రాలను విస్మరించి, పక్షపాత వైఖరిని అవలంభించినట్టు ఆరోపించింది. గ్రూపు దశ మ్యాచ్‌ నుంచి ఉద్దేశపూర్వకంగానే భారత్ చాంపియన్స్ తప్పుకుందని, అలాంటప్పుడు ఆ జట్టుకు పాయింట్ ఇవ్వడాన్ని పీసీబీ తప్పుబట్టింది. ఇది నిరాశకు గురి చేసిందని చెప్పింది. నిష్పాక్షిక పరిపాలన, ప్రాథమిక సూత్రాల విషయంలో రాజీపడే ఈ టోర్నీలో పీసీబీ కొనసాగలేదని తెలిపింది. పాకిస్తాన్ పేరును ప్రైవేట్ లీగ్స్‌లో వాడేందుకు అనుమతిని రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా, సెమీస్‌ నుంచి భారత్ తప్పుకోవడంతో పాకిస్తాన్ నేరుగా ఫైనల్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, టైటిల్ పోరులో సౌతాఫ్రికా చాంపియన్స్ చేతిలో చిత్తుగా ఓడింది.


Next Story