ఆసియా కప్ లో టీమిండియాను చిత్తుగా ఓడిస్తాం... పాకిస్తాన్ హెచ్చరికలు

by velandi.Saikiran |   (  Updated:2025-08-18 11:42:16  IST  )

పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని.. బీసీసీఐని కోరుతుంటే... అటు టీమిండియాను ఓడిస్తామని పాకిస్తాన్ వార్నింగ్

ఆసియా కప్ లో టీమిండియాను చిత్తుగా ఓడిస్తాం... పాకిస్తాన్ హెచ్చరికలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 ( Asia Cup 2025) టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందే ఇండియా ( Team India) వర్సెస్ పాకిస్తాన్ ( Pakisthan) మధ్య మాటల యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ జట్టుతో మ్యాచ్ ఆడకూడదని.. సీనియర్ క్రికెటర్లు.... బీసీసీఐని ( BCCI) కోరుతుంటే... అటు టీమిండియాను ఓడిస్తామని పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తోంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ హెడ్ కోచ్ ఆకిబ్ జావేద్ ( Aaqib Javed ) స్పందించారు.

ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో టీమిండియాను ఓడించి ఇంటికి పంపుతామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇండియా ఒక్కదాన్నే కాదు... అన్ని జట్టను ఓడించి టైటిల్ గెలుచుకుంటామని కూడా ఓవర్ గా రియాక్ట్ అయ్యారు పాకిస్తాన్ హెడ్ కోచ్ ఆకిబ్ జావేద్. సీనియర్ ఆటగాళ్లు బాబర్ అజాం అలాగే మహమ్మద్ రిజ్వాన్ లేకున్నప్పటికీ టీం ఇండియాను ఓడించే సత్తా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఆసియా కప్ బరిలోకి దిగిన తర్వాత తమ ప్రతాపం ఏంటో తెలుస్తుందని ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా నిన్ననే ఆసియా కప్ 2025 టోర్నమెంటుకు వాడే జట్టును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. 17 మంది సభ్యులతో కూడిన జట్టును తాజాగా ప్రకటించింది. అయితే ఇందులో బాబర్ అలాగే రిజ్వాన్ తో పాటు నషీమ్ కు చోటు దక్కలేదు. దీంతో ఆసియా కప్ లో పాకిస్తాన్ గెలవడం కష్టమే అని దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది.

Next Story