భారత్ తప్పుకుంది.. మేం పాయింట్లు పంచుకోం.. డబ్ల్యూసీఎల్‌కు తేల్చిచెప్పిన పాక్

by Phanindra |

డబ్ల్యూసీఎల్‌లో భారత్‌, పాక్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ పాయింట్స్ పంచుకోవడానికి పాక్ టీం నిరాకరిస్తోంది.

భారత్ తప్పుకుంది.. మేం పాయింట్లు పంచుకోం.. డబ్ల్యూసీఎల్‌కు తేల్చిచెప్పిన పాక్
X

దిశ, స్పోర్ట్స్: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో భారత్‌తో పాయింట్లు పంచుకునేందుకు పాకిస్తాన్ నిరాకరిస్తోంది. ఈ లీగ్‌లో భారత్, పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆడేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే భారత్ తప్పుకుంది కాబట్టి తాము పాయింట్లు షేర్ చేసుకోవడం జరగదని పాకిస్తాన్ ఛాంపియన్స్ టీం వాదిస్తోంది. ఇదే విషయాన్ని డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు తెలియజేశారట.

‘లీగ్ నిర్వాహకులుగా తామే మ్యాచ్ నిర్వహించలేకపోయామని ఈసీబీకి డబ్ల్యూసీఎల్ తెలిపింది. ఇండియా ఛాంపియన్స్‌ తప్పిదం ఏమీ లేదని. వారి చేతుల్లో లేని పరిస్థితుల వల్ల ఆ టీం ఆడలేకపోయింది. కాబట్టి ఆ జట్టును తప్పుబట్టలేం. కానీ పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు మాత్రం తాము ఆడేందుకు సిద్ధమైనా భారత జట్టు ఆడలేదు కాబట్టి.. పాయింట్లు పంచుకోవడానికి సిద్ధంగా లేమంటోంది’ అని డబ్ల్యూసీఎల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ లీగ్‌లో పాకిస్తాన్ టీం టేబుల్ టాపర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Next Story