- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఇండియన్ బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టంగా ఉంటది.. పాకిస్తాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
మన గురించి ఇంట్లో వాళ్లో.. స్నేహితులో గొప్పలు చెబితే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. శత్రువులు పొడుగుతుంటే మాత్రం ఆ కిక్కే వేరుంటది.

దిశ, వెబ్‌డెస్క్: మన గురించి ఇంట్లో వాళ్లో.. స్నేహితులో గొప్పలు చెబితే ఎలా ఉంటుందో తెలియదు కానీ.. శత్రువులు పొడుగుతుంటే మాత్రం ఆ కిక్కే వేరుంటది. తాజాగా ఇలాంటి ఫీలింగ్‌నే టీమిండియా(Team India) స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా(Jasprit Bumrah) ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఓ మీడియా ఛానల్‌కు పాకిస్తాన్(Pakistan) క్రికెట్ టీమ్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammad Rizwan) ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఎవరి బౌలింగ్‌లో ఆడటం కష్టంగా ఉంటుందని అడగ్గా.. ఒకప్పుడు ఆస్ట్రేలియన్ పేసర్ హేజిలవుడ్(Hazelwood)లో ఆడాలంటే భయంగా ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత బౌలర్ జస్ప్రీత్ బూమ్రా భర్తీ చేశాడు. ఇప్పుడు బూమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయాలంటే.. తనతో పాటు అనేక మంది బ్యాటర్లు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకొచ్చారు. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం.. ఇంకా ఛేజింగ్‌లో అయితే.. అతడు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తాడు అని రిజ్వాన్ అన్నారు. ప్రస్తుతం రిజ్వాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, ఇప్పటివరకు 204 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన బూమ్రా.. 443 వికెట్లు తీశారు. ఇక ఐపీఎల్‌లో ఇప్పటివరకు 133 మ్యాచులు ఆడి.. 165 వికెట్లు తీశారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నారు.






