- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fatima Sana: భారత్- పాకిస్తాన్ మ్యాచ్.. పాక్ కెప్టెన్ ఫాతిమా స్ప్రే ప్రయోగం.. నెట్టింట రచ్చ రచ్చ!
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తకర ఘటన చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Women's ODI World Cup) మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా (India-Pakistan match) భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఓ ఆసక్తకర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో పాక్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) మైదానంలో ఓ స్ప్రే ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి మైదానంలో చిన్న చిన్న పురుగులు ఇరు జట్ల ఆటగాళ్లను ఇబ్బంది పెట్టాయి. పురుగుల ప్రభావం ఎక్కువగా కావడంతో భారత్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ అంపైర్‌కు ఫిర్యాదు చేసింది.
దీంతో ఇన్నింగ్స్ 27 వ ఓవర్‌లో పురుగులను తరిమికొట్టే స్ప్రేలను ఉపయోగించేందుకు అంపైర్ పర్మిషన్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ ఫాతిమా సనాకు స్ప్రే ఇవ్వగా, ఆమె దాన్ని ఉపయోగించి పురుగులను తరిమే ప్రయత్నం చేసింది. అనంతరం మ్యాచ్ సాఫీగా సాగింది.
అయితే పాక్ కెప్టెన్ స్ప్రే కొట్టే విధానం నెట్టింట రచ్చ రచ్చ అవుతుంది. అటు పాకిస్తాన్, ఇటు భారత్ అభిమానులు పరస్పర ట్రోల్స్ చేసుకున్నారు. ‘అపోజిషన్ నుంచి దుర్వాసన కారణంగా ఫాతిమా సనా మైదానంలో స్ప్రే చేసింది’ అని పాక్ అభిమానులు ట్రోల్ చేయడం ప్రారంభించారు. మరోవైపు ఆమె స్ప్రే చేసింది కేవలం పాక్ ఆటగాళ్లకు వారి వద్దే దుర్వాసన వస్తుందని భారత్ అభిమానులు వివిధ రకాల పోస్టులతో ట్వీట్ల యుద్ధం మొదలైంది. ట్వీట్..






