- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాంపియన్స్ ట్రోఫీలో పాక్ జట్టే ఫేవరెట్ : సునీల్ గవాస్కర్
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టే ఫేవరెట్ అని భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

దిశ, స్పోర్ట్స్ : వచ్చే నెలలో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టే ఫేవరెట్ అని భారత లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. పాక్ జట్టే మళ్లీ చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పాడు. సొంత దేశంలో టోర్నీ జరగడ ఆ జట్టుకు కలిసొచ్చే విషయమని తెలిపాడు. ‘సొంత దేశంలో ఆతిథ్య జట్టును ఓడంచడం ఏ జట్టుకైనా అంత సులభం కాదు. కాబట్టి, చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్ ట్యాగ్ పాక్‌కే ఇవ్వాలి. 2023లో భారత్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌లో ఓడింది. కానీ, టైటిల్ పోరు కంటే ముందు వరుసగా 10 మ్యాచ్‌లు నెగ్గింది. అందుకే , రాబోయే టోర్నీలో పాకిస్తాన్ ఫేవరెట్ అని భావిస్తున్నా.’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. చివరిసారిగా 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో పాక్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.






