- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూపర్ 8 మ్యాచ్ రద్దు..పాకిస్తాన్ కు 50 శాతమే సెమీస్ ఛాన్స్ !
పాక్, న్యూజిలాండ్ సూపర్ 8 మ్యాచ్ రద్దు అయింది. దీంతో పాకిస్తాన్ కు 50 శాతమే సెమీస్ ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ 8కు చేరుకున్న పాకిస్తాన్ జట్టుకు ( Pakistan) కొత్త టెన్షన్ మొదలైంది. వర్షం కారణంగా న్యూజిలాండ్ తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లడం జటిలం కాబోతోంది. సూపర్ 8లో భాగంగా జరిగే ప్రతి మ్యాచ్ లో జట్లు అన్నియూ గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వర్షం కారణంగా న్యూజిలాండ్ , పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మొదటి సూపర్ 8 మ్యాచ్ వర్షం ( Rain) కారణంగా రద్దు అయింది. ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు జట్లకు తలో పాయింట్ లభించింది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో కచ్చితంగా రెండింటిలో గెలిస్తేనే, సెమీ ఫైనల్ ( Semi Final ) అవకాశాలు ఉంటాయి. లేకపోతే పాకిస్తాన్ కూడా బ్యాగులు సర్దుకొని లాహోర్ ( Lahore) వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇదే విషయం ఇప్పుడు పాకిస్తాన్ జట్టును కలవర పెడుతోంది.
సెమీ ఫైనల్ చేరాలంటే పాకిస్తాన్ ఏం చేయాలి ?
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శనివారం సూపర్ 8 లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య జరగాల్సి ఉంది. అయితే ముందుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లుగానే, మ్యాచ్ ప్రారంభం కాకముందే రద్దయింది. గడిచిన రెండు రోజుల నుంచి కొలంబోలో వర్షాలు పడుతున్నాయట. ఇక పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య ప్రేమదాస స్టేడియం వేదికగా శనివారం జరిగే మ్యాచ్ కు దాదాపు 60 నుంచి 80 శాతం వర్షం అంతరాయంగా మారే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. దానికి తగ్గట్టుగానే టాస్ పడిన తర్వాత కొలంబోలో వర్షం షురూ అయింది. వర్షం తగ్గుతుందని దాదాపు రెండు గంటల పాటు ఫీల్డ్ అంపైర్లు చూశారు.
క్రికెట్ అభిమానులు కూడా ఎదురు చూశారు. కానీ వరుణ దేవుడు ఏ మాత్రం కనుకరించలేదు. చివరికి మ్యాచ్ రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మ్యాచ్ రద్దు చేసిన అంపైర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ రూల్స్ ప్రకారం తలో ఒక పాయింట్ ఇచ్చారు. దీంతో పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లే అవకాశాలు సన్నగిల్లాయి. సూపర్ 8 దశలో మిగిలిన రెండు మ్యాచ్ ల్లో పాకిస్తాన్ కచ్చితంగా గెలవాలి. అలాంటప్పుడే సెమీ ఫైనల్ కు అవలీలగా వెళుతుంది పాకిస్తాన్. లేదా ఒక మ్యాచ్ లో భారీ స్కోర్ తేడాతో విజయం సాధించాలి. అయినప్పటికీ మిగిలిన జట్ల ఫలితాల ఆధారంగా పాకిస్తాన్ సెమీ ఫైనల్ వెళ్లే అవకాశాలు ఉంటాయి. అంటే పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్లడం కష్టమే అంటున్నారు. 50 శాతం మాత్రమే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే శ్రీలంక, ఇంగ్లాండ్ లాంటి జట్లతో మరో రెండు మ్యాచ్ లు పాకిస్తాన్ ఆడాల్సి ఉంటుంది. శ్రీలంక ఎలాగూ హోమ్ టీం. వాళ్లకు అడ్వాంటేజ్ ఎక్కువ. ఇటు ఇంగ్లాండ్ కూడా చాలా బలమైన జట్టు. ఆ రెండిటిని పాకిస్తాన్ కొట్టడం అంటే, చాలా కష్టమే అంటున్నారు. దీంతో పాకిస్తాన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.






