- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్ ప్లేయర్లతో BRS ఎమ్మెల్యే డిన్నర్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్( IPL 2025 ) కొనసాగుతున్న నేపథ్యంలో.. గుజరాత్ ప్లేయర్లతో ( Gujarat players )

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్( IPL 2025 ) కొనసాగుతున్న నేపథ్యంలో.. గుజరాత్ ప్లేయర్లతో ( Gujarat players ) మెరిశాడు గులాబీ పార్టీ ( BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy ). గుజరాత్ ప్లేయర్లు ఉన్న హోటల్ కు వెళ్లి వాళ్లతో సెల్ఫీలు దిగారు పాడి కౌశిక్ రెడ్డి, ఆయన కూతురు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా... ఆదివారం రోజున సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ), గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans ) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఈ నేపథ్యంలోనే... హైదరాబాద్ కు వచ్చారు గుజరాత్ ప్లేయర్లు. హైదరాబాద్ లో ఓ ప్రముఖ హోటల్లో దిగినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే... ఆ హోటల్ కు వెళ్ళిన పాడి కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ... గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ ( Shubhman Gill), మహమ్మద్ సిరాజ్ లతో ( Mohammed Siraj ) ఫోటోలు దిగింది. గతంలో మహమ్మద్ సిరాజ్ తో పాడి కౌశిక్ రెడ్డి... తరచూ క్రికెట్ ఆడేవాడు. ఆ సాన్నిహిత్యంతో... తాజాగా.. గుజరాత్ ప్లేయర్లతో పాడి కౌశిక్ రెడ్డి ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియోను.. స్వయంగా పాడి కౌశిక్ రెడ్డి తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. గుజరాత్ ప్లేయర్లను కలిసినట్లు.. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ), గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans ) జట్ల మధ్య మ్యాచ్ 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
It was great meeting two cricketing legends of our country, Shubman Gill and the iconic Apana Hyderabadi Siraj..@ShubmanGill @mdsirajofficial @PKR @Shrinika pic.twitter.com/gzz0WAPqE7
— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) April 5, 2025






