మా జట్టు శుద్ధ దండగ.. సొంత జట్టుపై మండిపడ్డ పాక్ మాజీ ఆటగాడు

by Geesa Chandu |   (  Updated:2024-08-17 09:14:14  IST  )

పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఫీల్డింగ్ లో పేలవ ప్రదర్శన చేయడం వారికి సర్వసాధారణం.

మా జట్టు శుద్ధ దండగ.. సొంత జట్టుపై మండిపడ్డ పాక్ మాజీ ఆటగాడు
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఫీల్డింగ్ లో పేలవ ప్రదర్శన చేయడం వారికి సర్వసాధారణం. ఫిట్ నెస్ విషయానికి వస్తే అంతే సంగతులు. ఒక రకంగా చెప్పాలంటే పాక్ ఆటగాళ్లకు ఫిట్నెస్ ఉండదనే గట్టి పేరు కూడా ఉంది. పాక్ ఆటగాళ్లు తరచూ గాయాలపాలవుతూ, విమర్శలను సైతం బాగానే మూటగట్టుకుంటారు. టీ20 ప్రపంచ కప్ 2024 కు ముందు పాక్ ఆటగాళ్లందరూ ఫిట్నెస్ కోసం ఆర్మీలో ట్రైనింగ్ కూడా పూర్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అదే మెగా టోర్నీలో సూపర్ 8 కు చేరుకోలేక చేతులెత్తేసింది. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నపటికీ.. ఫిట్నెస్ లేకపోవడం అనేది ఇప్పుడు పాకిస్థాన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు సల్మాన్ బట్. పాకిస్థాన్ ఆటగాళ్లకు ఫిట్నెస్ లెవల్స్ అనేవే ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ మాజీ ఆటగాడు. అయితే కొంత మంది జట్టు సభ్యులను మాత్రం ప్రశంసించాడు. పాక్ జట్టులో ప్రస్తుతం మహమ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్, షాన్ మసూద్ లు ఫిట్నెస్ తో కనిపిస్తున్నారని తెలిపాడు. వారు ముగ్గురు యోయో టెస్ట్ లో మంచి స్కోరులను నమోదు చేశారని అన్నాడు. మైదానం విషయానికి వస్తే వారు బాగా పరుగెత్తగలరని తెలిపాడు. అయితే ఈ ముగ్గురు వరల్డ్ క్రికెట్ లోనే టాప్ టెన్ ర్యంకులో ఉంటారని తన యూట్యూబ్ ఛానల్ లో చెప్పుకొచ్చాడు సల్మాన్ బట్.

Next Story