- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంచలన నిర్ణయం తీసుకున్న భారత హాకీ క్రీడాకారిణి వందన
భారత హాకీ క్రీడాకారిణి వందన కటారియా షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

దిశ,స్పోర్ట్స్ : భారత హాకీ క్రీడాకారిణి వందన కటారియా షాకింగ్ డెసిషన్ తీసుకుంది. 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికింది. మంగళవారం రిటైర్మెంట్ ప్రకటన చేసింది. ‘ఈ నిర్ణయం చాలా కష్టతరమైనది. కానీ, ఇదే సరైన సమయమని నాకు తెలుసు. భారత జెర్సీ ధరించడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రతి ప్రయాణానికి ముగింపు ఉంటుంది. ఎంతో గర్వంగా, కృతజ్ఞతాభావంతో ఆట నుంచి వైదొలుగుతున్నా.’ అని తెలిపింది.
వందన ఫిబ్రవరిలో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2009లో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె భారత్ విజయాల్లో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించింది. 2016, 2020 ఒలింపిక్స్‌లలో ఆమె పాల్గొంది. 2016, 2023లలో ఆసియా చాంపియన్‌షిప్ గెలవడంలో ఆమెదే ముఖ్య పాత్ర. 2022లో నేషన్స్ కప్ విజయంలో కూడా ఆమె భాగమైంది. అలాగే, మూడు ఆసియా గేమ్స్(2018, 2014, 2022), 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు గెలిచిన భారత జట్టులో ఆమె సభ్యురాలు. వందన 320 మ్యాచ్‌ల్లో 158 గోల్స్ చేసింది. టీమిండియాకు అత్యధిక సార్లు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా నిలిచింది. హాకీకి వందన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2021లో అర్జున అవార్డు, 2022లో పద్మశ్రీతో సత్కరించింది.






