వింబుల్డన్‌లో శతవిజయాల జయగాధ.. జకోవిచ్ చరిత్రలోకి

by Bhanu |

లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లో నొవాక్ జకోవిచ్ మరోసారి చరిత్రలో తన పేరు చిరస్థాయిగా

వింబుల్డన్‌లో శతవిజయాల జయగాధ.. జకోవిచ్ చరిత్రలోకి
X

దిశ, వెబ్ డెస్క్ : లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లో నొవాక్ జకోవిచ్ మరోసారి చరిత్రలో తన పేరు చిరస్థాయిగా లిఖించుకునే ఘనత సాధించాడు. అతడు వింబుల్డన్‌లో 100 విజయాలు అందుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. 38 ఏళ్ల వయసులోనూ యువ ఆటగాళ్లకు సవాలు విసురుతున్న ఈ సెర్బియన్ లెజెండ్, ఇప్పటికీ తన ఆటతీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు.

తనే తనకు పోటీగా నిలుస్తూ..

ఇప్పటిదాకా 20 వింబుల్డన్ టోర్నీలకు హాజరైన జకోవిచ్, తాజాగా తన దేశస్తుడు కెమనోవిచ్‌ను వరుస సెట్లలో (6-3, 6-0, 6-4) ఓడించాడు. ఈ విజయం ద్వారా వింబుల్డన్‌ చరిత్రలో 100 విజయాలు అందుకున్న మూడవ ఆటగాడిగా మారాడు. ఈ ఘనతను అతడి ముందు కేవలం ఇద్దరు దిగ్గజాలు – మార్టినా నవ్రతిలోవా (120 విజయాలు), రోజర్ ఫెదరర్ (105 విజయాలు) మాత్రమే సాధించగలిగారు.

ఫెదరర్ రికార్డుకు జకోవిచ్ ఛాలెంజ్..!

రోజర్ ఫెదరర్ 8 సార్లు వింబుల్డన్ ఛాంపియన్‌గా నిలిచిన రికార్డును సమం చేయడానికి జకోవిచ్ ఈసారి బరిలో ఉన్నాడు. తన 8వ టైటిల్‌ కోసం పోరాడుతున్న జకోవిచ్, ATP ర్యాంకింగ్స్‌లో 428 వారాల పాటు వరుసగా నంబర్ వన్‌గా కొనసాగిన ఘన చరిత్రను కూడా కలిగిఉన్నాడు.

ఓపెన్ ఎరాలో కొత్త మైలురాయి..?

38 ఏళ్ల వయసులో వింబుల్డన్ టైటిల్ గెలిస్తే, ఓపెన్ ఎరా పురుషుల విభాగంలో అత్యధిక వయస్సులో మేజర్ టైటిల్ గెలిచిన ఆటగాడిగా కూడా నిలవనున్నాడు. ఇది ఒకే సంవత్సరం లో క్లే కోర్ట్ (రోలాండ్ గారోస్‌) , గ్రాస్ కోర్ట్ (వింబుల్డన్‌) రెండు టోర్నీల్లో 100వ విజయాన్ని సాధించిన అరుదైన ఘనత కూడా అవుతుంది. టెన్నిస్ ప్రపంచంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన జకోవిచ్, మరోసారి తన మళ్లీ తిరిగే సంచలనం కాదు.. నిరంతర విజయాల చరిత్ర అని నిరూపిస్తున్నాడు.


Next Story