జకో 99వ విన్.. 19వ సారి వింబుల్డన్ మూడో రౌండ్‌కు నొవాక్!

by Phanindra |

సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిక్ వింబుల్డన్‌లో అద్భుతంగా ఆడాడు. వింబుల్డన్‌లో 99వ విన్ నమోదు చేసి, 19వ సారి మూడో రౌండ్‌కు చేరాడు.

జకో 99వ విన్.. 19వ సారి వింబుల్డన్ మూడో రౌండ్‌కు నొవాక్!
X

దిశ, స్పోర్ట్స్: వింబుల్డన్‌లో స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిక్ ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో డాన్ ఎవాన్స్‌ను 6-3, 6-2, 6-0 తేడాతో ఓడించాడు. ఇది వింబుల్డన్‌లో జకో కెరీర్లో 99వ విజయం కావడం గమనార్హం. అలాగే మూడో రౌండ్‌కు చేరడం ఇది 19వ సారి. ఓపెన్ ఎరా మొదలైన తర్వా అత్యధిక సార్లు వింబుల్డన్ మూడో రౌండ్‌కు అర్హత సాధించిన ప్లేయర్‌గా జకో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండింట్లో జకోకు 100పైగా విజయాలున్నాయి. ఈ క్రమంలో వింబుల్డన్‌లో అతను మరో విజయం సాధిస్తే మూడు గ్రాండ్ స్లామ్స్‌లో వందేసి విజయాలు సాధించిన ప్లేయర్‌గా నిలుస్తాడు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ కూడా ముందడుగు వేశాడు. బ్రిటన్‌కు చెందిన ఓలివర్ టార్వెట్‌తో జరిగిన మ్యాచులో 6-1, 6-4, 6-4 తేడాతో అల్కరాజ్ నెగ్గాడు.

Next Story