సిన్సినాటి ఓపెన్ నుంచి తప్పుకున్న జకోవిక్

by Phanindra |

సిన్సినాటి ఓపెన్ నుంచి జకోవిక్ తప్పుకున్నాడు. వింబుల్డన్ తర్వాత నేరుగా యూఎస్ ఓపెన్‌లోనే ఈ సెర్బియన్ స్టార్ ఆడనున్నాడు.

సిన్సినాటి ఓపెన్ నుంచి తప్పుకున్న జకోవిక్
X

దిశ, స్పోర్ట్స్: సిన్సినాటి ఓపెన్ నుంచి లెజెండరీ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిక్ తప్పుకున్నాడు. నాన్-మెడికల్ కారణాలతో తను ఈ టోర్నీలో ఆడటం లేదని జకోవిక్ వెల్లడించాడు. ఇలా సిన్సినాటి ఓపెన్ నుంచి జకోవిక్ తప్పుకోవడం వరుసగా ఇది రెండో ఏడాది కావడం గమనార్హం. వింబుల్డన్‌ సెమీస్‌లో జానిక్ సిన్నర్‌ చేతిలో ఓడిన తర్వాత 38-ఏళ్ల జకోవిక్ మరే పోటీలో పాల్గొనలేదు.

అదే టోర్నీ క్వార్టర్‌ఫైనల్‌లో జకోవిక్ కింద పడి గాయపడ్డాడు. ఆ తర్వాత మరే పోటీలో పాల్గొనని జకో.. టొరంటో మాస్టర్స్‌లో కూడా పాల్గొనలేదు. ఇప్పుడు సిన్సినాటి టోర్నమెంట్ నుంచి కూడా తప్పుకున్న ఈ సెర్బియన్ స్టార్.. ఆగస్టు 24న మొదలయ్యే యూఎస్ ఓపెన్‌లో నేరుగా పాల్గొననున్నాడు.

అయితే గతేడాది కూడా సిన్సినాటి టోర్నీ ఆడలేదు కాబట్టి.. అతని ర్యాంకింగ్స్‌పై తాజా నిర్ణయం పెద్దగా ప్రభావం చూపించదు. జకోవిక్ నిర్ణయాన్ని అర్థంచేసుకుంటున్నట్లు సిన్సినాటి టోర్నీ నిర్వాహకులు చెప్పారు. గ్రాండ్ స్లామ్ కోసం సన్నద్ధమవడం కూడా కీలకమేనని తెలిపారు.

Next Story