- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన జకోవిక్
యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సెర్బియన్ స్టార్ జకోవిక్ దూసుకెళ్లాడు. డిఫెండింగ్ ఛాంపియన్ సబలెంక, స్వైటెక్ కూడా క్వార్టర్స్ చేరారు.

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిక్ మరోసారి చరిత్ర సృష్టించాడు. 38 ఏళ్ల వయసులో జాన్ లెనార్డ్ స్ట్రఫ్‌పై 6-3, 6-3, 6-2 తేడాతో అలవోకగా గెలిచిన అతను యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. దీంతో అత్యంత పెద్ద వయసులో నాలుగు గ్రాండ్‌స్లామ్స్ క్వార్టర్స్ చేరిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే ఆ మ్యాచ్ తన కూతురు బర్త్‌డే రోజు జరగనుందని, అందుకే తన కూతురు హ్యాపీగా లేదని జకోవిక్ అన్నాడు. జకో కెరీర్‌లో ఇది 64వ గ్రాండ్‌స్లామ్ క్వార్టర్స్ కావడం గమనార్హం. యూఎస్‌కు చెందిన టేలర్ ఫ్రిట్జ్, కెనడా స్టార్ ఫీలిక్స్ ఆగర్ కూడా క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు.
సబలెంక కూడా..
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబలెంక కూడా క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. స్పెయిన్‌కు చెందిన క్రిస్టీనా బుక్సాపై 6-1, 6-4 తేడాతో సునాయాస విజయం సాధించింది. ఇక మరో స్టార్ ప్లేయర్ ఇగా స్వైటెక్ కూడా అద్భుతంగా ఆడింది. రష్యాకు చెందిన అలెగ్జాండ్రోవాపై 6-3, 6-1 తేడాతో అదిరే విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. జూనియర్స్ విభాగంలో భారత్‌కు చెందిన మాయా రాజేశ్వరన్ రేవతి అద్భుతమైన ప్రదర్శనతో గర్స్స్ సింగిల్స్ రెండో రౌండ్‌కు చేరుకుంది. చైనాకు చెందిన ఝాంగ్ కియాన్ వేయ్‌పై 7-6 (5), 6-3 తేడాతో ఓడించింది.






