- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PAK vs WI, 2nd Test: టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన నోమన్ అలీ
పాకిస్తాన్(Pakistan), వెస్టిండీస్(West Indies) జట్ల మధ్య.. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్(PAK vs WI, 2nd Test,) జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్(Pakistan), వెస్టిండీస్(West Indies) జట్ల మధ్య.. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్(PAK vs WI, 2nd Test,) జరుగుతోంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భీకర ఫామ్ లో కనబరుస్తున్న 38 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ నోమన్ అలీ(Noman Ali) టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. శనివారం రోజు రెండో టెస్ట్ ప్రారంభం కాగా.. మొదటి రోజే ఇరు జట్లు ఆలౌట్ అయ్యాయి. ఇందులో మొదట పాకిస్థాన్ జట్టు 154 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ జట్టు కూడా కేవలం 163 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందులో పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్ అయిన నోమన్ అలీ(Noman Ali) చరిత్ర హ్యాట్రిక్ వికెట్లు(Hat-trick wickets) పడగొట్టడమే కాకుండా.. ఆరు వికెట్లను తీసుకుని చరిత్ర సృష్టించాడు. కాగా పాకిస్తాన్ నుండి టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన మొదటి స్పిన్నర్‌గా నోమన్ అలీ నిలిచాడు. నోమన్ కంటే ముందు, టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన మొదటి పాకిస్తాన్ బౌలర్ వసీం అక్రమ్ నిలవగా ఆయన 1999లో శ్రీలంకపై రెండు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్నాడు. తాజాగా నోమన్ టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టి.. ఐదుగురు పాకిస్తానీ బౌలర్‌లతో కూడిన ఎలైట్ గ్రూప్‌లో చేరాడు.






