భారత్‌కు నిరాశ.. మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లాండ్‌లోనే

by Harish |

సింగపూర్‌లో శనివారం జరిగిన ఐసీసీ వార్షిక సదస్సు‌లో తీసుకున్న నిర్ణయాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆదివారం ప్రకటించింది.

భారత్‌కు నిరాశ.. మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లాండ్‌లోనే
X

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో శనివారం జరిగిన ఐసీసీ వార్షిక సదస్సు‌లో తీసుకున్న నిర్ణయాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఆదివారం ప్రకటించింది. మూడు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్స్ ఆతిథ్య హక్కులను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)కి ఐసీసీ కట్టబెట్టింది. దీంతో 2027, 2029, 2031 ఫైనల్స్‌ ఇంగ్లాండ్‌లోనే జరగనున్నాయి. 2021, 2023, 2025 ఫైనల్స్ ఇంగ్లాండ్‌లోనే జరిగిన విషయం తెలిసిందే. మూడు ఫైనల్స్‌ను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆతిథ్య హక్కుల కోసం చూసిన భారత్, ఆస్ట్రేలియాలకు నిరాశ తప్పలేదు. ఐసీసీలో రెండు కొత్త బోర్డులు చేరాయి. టిమోర్ లెస్టె క్రికెట్ ఫెడరేషన్, జాంబియా క్రికెట్ యూనియన్‌లను అసోసియేట్ నేషన్స్‌గా చేర్చింది. దీంతో ఐసీసీ సభ్యుల సంఖ్య 110కు చేరింది. అలాగే, గురుమూర్తి పలని(ఫ్రాన్స్ క్రికెట్), అనురాగ్ భట్‌నగర్(క్రికెట్ హాంకాంగ్,చైనా), గుర్‌దీప్ క్లెయిర్(క్రికెట్ కెనడా) ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి అసోసియేట్ మెంబర్స్‌గా ఎన్నికయ్యారు. అయితే, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028 క్వాలిఫికేషన్‌పై తుది నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చినా ఐసీసీ దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.


Next Story